ఆలూర్ లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు….

On: Monday, July 7, 2025 5:13 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కి సంబంధించిన పలు ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు బోధించడం జరుగుతుంది. అయినా కానీ నూతనంగా ఎంఈఓ కార్యాలయం ఎంఈఓ ని ప్రభుత్వం నియమించింది కానీ నియంత్రణ లోపించింది అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. పాఠశాలల్లో కనీస వసతులు లేకుండా అధిక సంఖ్యలో విద్యార్థులకు తరగతులు బోధించడం జరుగుతుంది. పలు పాఠశాలల్లో కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా పాటించడం లేదు .ఏమైనా ప్రమాదం జరిగితే ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పిల్లలు ఆటలు ఆడుకోవడానికి కనీసం ఆటస్థలం కూడా లేవు కొన్ని పాఠశాలలో.

అర్హత లేని ఉపాధ్యాయులు ఉన్నారు కొన్ని పాఠశాలలో ఆలూరు మండలంలో దాదాపుగా 10 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.

ఇప్పటికయినా అధికారులు స్పందిచి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

23 Jul 2025

Leave a Comment