“మహిళల రక్షణకు అప్రమత్తంగా ఉన్న పోలీస్ ‘షీ టీం’: అత్యాచారం, హింస నిందితులపై కఠిన చర్యలు”….

On: Saturday, August 30, 2025 9:08 PM

 

బాధితుల వివరాలు గోప్యమే – భరోసా ఇచ్చిన షీ టీం.

మహిళల రక్షణ కోసం అప్రమత్తంగా ఉన్న పోలీస్ షీ టీం.

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆలూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ షీ టీం కానిస్టేబుళ్లు విగ్నేష్, సుమతి విద్యార్థినులకు క్రైమ్‌పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్ టీజింగ్‌ జరిగినా వెంటనే షీ టీంకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు. ఈవ్‌టీజింగ్‌ లేదా వేధింపులకు గురైతే మహిళలు భయపడకుండా ముందుకు రావాలని, తక్షణ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సమాచారం ఇవ్వాలనుకునే వారు షీ టీం నెంబర్ 8712659795 కు లేదా డయల్ 100 కు సంప్రదించాలని సూచించారు. అదనంగా, క్యూ ఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసే విధానాన్ని కూడా వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై అప్పారావు, హెడ్ కానిస్టేబుల్ వినంత్రావు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారి ఎం. నరేందర్, జిల్లా మహిళా సాధికారత కేంద్రం నుండి పుష్ప, పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మొహమ్మద్ అశ్ఫాక్ అహ్మద్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

15 Mar 2026

Leave a Comment