
7 కోట్ల విలువైన ప్రాంసరీ నోట్లు, చెక్కులు – రూ.13.97 లక్షల నగదు స్వాధీనం.
ఆర్మూర్, ఆగస్టు 23:
ఆర్మూర్ పట్టణం మరియు సమీప సుర్బిర్యాల్ గ్రామంలో అక్రమ రుణ రాకెట్‌ను పోలీసులు భగ్నం చేశారు. అనుమతులు లేకుండా, అక్రమంగా ప్రజలకు రుణాలు ఇచ్చి వారిని మోసం చేస్తున్న 7 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడిలో పోలీసులు రూ.13,97,600 నగదుతో పాటు దాదాపు 7 కోట్ల రూపాయల విలువైన ఖాళీ ప్రాంసరీ నోట్లు, చెక్కులు, బాండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మనీలెండర్లు ప్రజల వద్ద వస్తువులను తాకట్టు పెట్టించుకొని, ఖాళీ ప్రాంసరీ నోట్లపై మరియు చెక్కులపై బలవంతంగా సంతకాలు తీసుకుని అధిక వడ్డీలతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పూర్తి కేసు మీద దర్యాప్తు కొనసాగుతుందని, బాధితులు ముందుకు రావాలని పోలీసులు సూచించారు. ఈ ఘటనతో ఆర్మూర్ ప్రజలలో కొంతవరకు ఊరట వ్యక్తమవుతోంది.







