పిప్రి, మంథని గ్రామాల వద్ద పోలీసుల రూట్ మార్చ్….

On: Tuesday, December 16, 2025 8:10 PM

A9 న్యూస్ ఆర్మూర్:

శాంతిభద్రతలు పటిష్టంగా నిలబెట్టడం, ప్రజల్లో భద్రతా భావన కల్పించడం లక్ష్యంగా పిప్రి, మంథని గ్రామాల వద్ద పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. ఈ రూట్ మార్చ్ సందర్భంగా గ్రామాల్లో ప్రధాన వీధుల గుండా పోలీసులు పాదయాత్రగా వెళ్లి భద్రతా పరిస్థితులను సమీక్షించారు.

ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని కోరారు.

03 Mar 2026

Leave a Comment