A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వాగులను మంగళవారం సాయంత్రం స్వయంగా పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సిరికొండ మండలంలోని వరద ప్రభావిత గ్రామాలు కొండూరు, తుంపల్లి ప్రాంతాల్లోని ముఖ్య వాగులను సందర్శించారు.
ఈ సందర్భంగా కమిషనర్:
*కొండూరు గ్రామ సరిహద్దులోని వాగు,
*తుంపల్లి – పాకాల మార్గ మధ్యలోని కప్పల వాగు,
*సిరికొండ – న్యావనంది మార్గంలో ఉన్న దొండ్ల వాగు.
వంటి ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలించారు.
ప్రజలతో మాట్లాడుతూ, వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తతపై అవగాహన కల్పించారు. అలాగే, గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు ఎంత అవసరమో వివరించి, ప్రతి గ్రామంలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో ధర్పల్లి సీఐ బిక్షపతి, సిరికొండ ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.