న్యూఢిల్లీ, ఆగస్ట్ 7:
తెలంగాణ రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి అవుతున్న బియ్యం నాణ్యతపై ఆ దేశ వ్యవసాయ మంత్రి PTU లారెల్ జూనియర్ ప్రశంసలు కురిపించారు.
ఈ రోజు న్యూఢిల్లీలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో లారెల్ జూనియర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బియ్యం శుభ్రమైనదిగా, అధిక నాణ్యత కలిగినదిగా ఫిలిప్పీన్స్ మార్కెట్లో మంచి పేరు సంపాదించిందని పేర్కొన్నారు.
తెలంగాణలో సాగు, ధాన్యం ప్రాసెసింగ్ విధానాలు, సరఫరా వ్యవస్థపై కూడా ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల పరస్పర సహకారంపై చర్చలు జరిగినట్టు సమాచారం.