*గ్రామాల్లో సురక్షితంగా ఇళ్లలోనే ఉండండి..
*చెరువుల వద్దకు వెళ్లొద్దని యువతకు హెచ్చరిక..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ సూచనలు:
భారీ వర్షాల కారణంగా రహదారులకు అంతరాయం కలిగితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ ప్రజలను కోరారు. మండల పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో, ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని సూచించారు.
గ్రామాల్లో నివసిస్తున్న వారు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని, ముఖ్యంగా యువత, చిన్నారులు చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనూ వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ తెలిపారు.






