పండుగ సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి : జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్…..

On: Sunday, September 21, 2025 5:52 AM

 

బతుకమ్మ, దసరా పండగ సందర్భంగా విద్యార్థులకు సెలవులు ప్రకటించబడిన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు సూచించారు.

పండుగ వేళల్లో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అన్న విషయాలను తల్లిదండ్రులు క్రమం తప్పకుండా గమనించాలి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చెరువులు, వాగులు నిండిన నేపథ్యంలో పిల్లలను ఆ ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

అలాగే పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం వల్ల అపరిచితుల నుండి ఫోన్ కాల్స్ రావచ్చును. దాంతో మోసపూరిత చర్యలు, సైబర్ మోసాలు జరగవచ్చునని హెచ్చరించారు.

అంతేకాకుండా, మైనర్లు కు ద్విచక్ర వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వయస్సు నిండని పిల్లల చేత వాహనాలు నడిపించడం చట్టపరమైన నేరం మరియు ప్రమాదకరమూ కాబట్టి, అలాంటి చర్యలు జరగకుండా తల్లిదండ్రులే బాధ్యత వహించాలి అని ఎస్పీ గారు సూచించారు.

జిల్లా ప్రజలు సైబర్ నేరాలకు గురికాకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, పండుగ వేళల్లో తమ పిల్లల భద్రతపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

15 Mar 2026

Leave a Comment