
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం అమీర్‌నగర్ గ్రామ పంచాయతీలో పామాయిల్ సాగు కార్యక్రమాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ శ్యామ్, హెచ్ ఈ ఓ. సుధీర్, క్లస్టర్ ఆఫీసర్, నాగేష్ గౌడ, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు రైతులకు పామాయిల్ పంట ప్రాముఖ్యతను వివరిస్తూ ఆధునిక పద్ధతులు, సాగు విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై వివరించారు. పామాయిల్ పంటతో రైతులకు దీర్ఘకాలిక లాభాలు చేకూరుతాయని, తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే పామాయిల్ సాగు ద్వారా భవిష్యత్తులో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు రైతులు పామాయిల్ సాగుపై ఆసక్తి చూపాలని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.







