మచ్చర్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై పరిశీలన:

On: Tuesday, July 8, 2025 7:34 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ నియోజకవర్గంలోని మచ్చర్ల గ్రామంలో మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాలూరి చిన్నా ఉషన్న ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సందర్శన నిర్వహించారు.

ఈ సందర్బంగా సభ్యులు మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణానికి ఏవైనా అడ్డంకులు బిల్లుల విషయంలో ఇబ్బందులు ఉంటే మాతో పంచుకోవాలి ఎలాంటి సమస్య అయినా వెంటనే వినయ్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి,పరిష్కరించేందుకు మా సహకారం ఉంటుందని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలూరి చిన్నా ఉషన్న,మాజీ ఎంపీటీసీ మంతెన సంజీవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ద్యావతి నారాయణ, సమీర్, సంబంధిత అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

23 Jul 2025

Leave a Comment