ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో నాలుగో వార్డు అభ్యర్థిగా
పట్టభద్రుడు సరికేలి సృజన్
“మాటలు కాదు – పని చేసి చూపిస్తా” అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చారు.
ఇన్నాళ్లుగా నిర్లక్ష్యానికి గురైన నాలుగో వార్డును అభివృద్ధి బాటలో నడిపించడమే తన లక్ష్యమని స్పష్టం చేస్తూ, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వార్డు ప్రజల ప్రతి సమస్య తన సమస్యగా భావించి, ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, నిజాయితీతో సేవ చేసే నాయకుడిగా నిలుస్తానని హామీ ఇస్తున్నారు.
ఈ సందర్భంగా నాలుగో వార్డు ప్రజలందరికీ ఓటు హక్కును బాధ్యతగా వినియోగం చేసుకొని, మీ అమూల్యమైన ఓటుతో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వినయపూర్వకంగా కానీ గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
మీ ఒక్క ఓటే నాలుగో వార్డు భవిష్యత్తును మార్చే శక్తి.
మీ నమ్మకానికి ప్రతిఫలంగా అభివృద్ధిని చేసి చూపిస్తానని నాయొక్క మనవి.
✊ అభివృద్ధికి ఓటు – సరికేలి సృజన్‌కు ఓటు ✊






