
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పి సాయి చైతన్య ఐపీఎస్ తెలిపారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్ ఈద్గా ప్రాంతాన్ని ఆయన స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈద్గా వద్ద జరిగే సామూహిక ప్రార్థనలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, పార్కింగ్, భద్రత అంశాలపై నిర్వాహకులు మరియు పోలీస్ అధికారులతో చర్చించారు. ప్రత్యేక ప్రార్థనలకు భారీగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.
పండుగ రోజు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులకు సూచనలు ఇచ్చారు. ప్రజలు సురక్షితంగా, ప్రశాంతంగా పండుగను జరుపుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రంజాన్ పవిత్ర పండుగను ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్.హెచ్.ఓ పి. సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.








