నిజామాబాద్:ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల నిర్వహించిన 5వ సీనియర్ మహిళల మరియు పురుషుల బేస్‌బాల్ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ చూపారు. ఈ టోర్నీలో బాలికల విభాగంలో తొలి స్థానం సాధించిన జట్టు సభ్యులు — ఆర్మూర్ టీఎస్ డబుల్ ఆర్ఎస్ డిగ్రీ కళాశాలకి చెందిన సౌమ్యారాణి, జీజీ కాలేజ్‌కు చెందిన శృతి, అనూష, మరియు టీఎస్ డబుల్ ఆర్ఎస్ సుద్దపల్లి కి చెందిన శరణ్య — జట్టును విజయవంతంగా నడిపించారు.
పురుషుల విభాగంలో జీజీ కాలేజ్‌కు చెందిన సాయికుమార్ మెరుగైన ప్రదర్శనతో ఎంపికయ్యాడు.
ఈ క్రీడాకారులు ఆగస్టు 28 నుండి 31 వరకు మహారాష్ట్ర అమరావతిలో జరగనున్న జాతీయస్థాయి బేస్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నారు అని తెలంగాణ రాష్ట్ర బేస్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్వేతా గారు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎల్. మధుసూదన్ రెడ్డి, జిల్లా సెక్రటరీ సొప్పరి వినోద్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శులు జక్రాన్‌పల్లి మరకంటి గంగామోహన్, కోచ్ నరేష్, మౌనిక, పీఈటీలు జోష్ణ, నర్మద మరియు ఉపాధ్యాయ బృందం క్రీడాకారులను అభినందించారు.







