నిజాం సాగర్ కాల్వలో వినాయక నిమజ్జనం – అల్ మార్క్ ఫైనాన్షియల్ సర్వీసెస్…

On: Thursday, September 4, 2025 10:37 PM

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:

నిజామాబాద్ నగరంలో ఎస్బిఐ అల్ మార్క్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రుల ఉత్సవాలు భక్తి, ఆనందాల మధ్య అంగరంగ వైభవంగా సాగాయి. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో వినాయకునీ పూజలు, హరతులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉత్సవాల సందర్భంగా నాగారం చివరలోని నిజాం సాగర్ కాల్వలో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్రను నిర్వహించారు. ద్విచక్ర వాహనాల ర్యాలీతో నినాదాలతో, నిమజ్జన వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అలాగే, ఉత్సవాలలో భాగంగా జరిగిన లడ్డు వేలం భక్తుల ఉత్సాహానికి నిదర్శనంగా నిలిచింది. ఆశ్చర్యకరంగా ₹8,616 గణేశుని లడ్డూని బాన్సువాడకు చెందిన వేణుగోపాల్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన “వినాయకుడి కృపతో అందరికీ శుభాలే కలగాలని” ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మేనేజర్ ప్రవీణ్, సూపర్వైజర్ జాన్సన్, టీఎస్ మోహన్, కిరణ్, సత్పాల్, సూర్యవంశీ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

15 Mar 2026

Leave a Comment