2026-27 నుంచి తెలంగాణలో కొత్త విద్య విధానం అమలుకు ప్రణాళిక…

On: Tuesday, September 2, 2025 2:38 PM

 

హైదరాబాద్:సెప్టెంబర్ 02

తెలంగాణ విద్యా విధా నాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, చైర్మన్ గా మరో ఐదుగురు సభ్యులు గా కమిటీ ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.. విద్యారంగంలో సంస్కర ణలే ప్రధాన లక్ష్యంగా ఈ కమిటీ అధ్యయనం చేసి అక్టోబర్ 30 లోపు నివేదిక అందించాలని ఆదేశించింది..

2024 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో సంస్కరణలకు మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్ గా మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, సభ్యులుగా మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమిం చింది, ఆ కమిటీ సైతం జాతీయ విద్యా విధానం ఏ అంశాలను అమలు చేయవచ్చో వివరిస్తూ.. నివేదిక ఇవ్వాలని గత ఏడాది అధికారులను ఆదేశించింది, అయినా ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మరో కమిటీని నియమించింది.

రాష్ట్ర సర్కార్, తాజాగా సొంత పాలసీ రూపకల్పన కోసం ఏడుగురు సభ్యుల తో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారు కేశవరావు,ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించను న్నారు. సభ్యులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తెలంగాణ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఆకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి నియమితులయ్యారు.

విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సభ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అవసరమైతే మరో సభ్యుడిని నియమిం చుకునే అధికారాన్ని ఛైర్మన్‌కు కల్పించారు. ఈ కమిటీ అక్టోబరు 30వ తేదీలోగా తమ నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది.

తెలంగాణ రైజింగ్‌-2027’ లక్ష్యానికి అనుగుణంగా కొత్త విద్యా విధానం ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ బోధన, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్క రణలు, పరిశోధనలు, అంతర్జాతీయ అవకాశా లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. పారిశ్రామిక రంగానికి, విద్యాసంస్థలకు మధ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని కోరింది.

పాఠశాల విద్య నుంచి ఉన్నత, సాంకేతిక విద్య వరకు అన్ని స్థాయిల్లో అవసరమైన సంస్కరణ లను ఈ కమిటీ సిఫారసు చేయనుంది.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేసేందుకే ఎన్‌ఈపీ- 2020ని ఏకపక్షంగా తీసుకొచ్చిందని పలు రాష్ట్రాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించి సొంత విధానాలను రూపొందించు కుంటున్నాయి. ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న తెలంగాణ సైతం ఇప్పుడు అదే బాటలో పయని స్తోంది. ఎన్‌ఈపీలోని వివాదాస్పద అంశాలను పక్కనపెట్టి, రాష్ట్ర అవస రాలకు తగినట్లుగా కొన్ని ముఖ్యమైన అంశాలను స్వీకరించి ఈ కొత్త విధానా న్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నూతన విద్యా విధా నాన్ని 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

05 Feb 2026

Leave a Comment