గెలిచేవారికే మున్సిపల్ టికెట్లు: వివేక్ వెంకటస్వామి….

On: Wednesday, January 21, 2026 11:24 AM

 

Jan 21, 2026,

మున్సిపల్ ఎన్నికల్లో సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని, గెలిచే అవకాశమున్న వారికే ప్రాధాన్యత ఇస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు, వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం వడ్డీలేని రుణాలు, మహిళా క్యాంటీన్ల ద్వారా ఉపాధి, ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుపై అందిస్తున్నామని తెలిపారు.

22 Mar 2026

Leave a Comment