ఫిబ్రవరి రెండో వారంలోనే మునిసీపల్ ఎన్నికలు…

On: Monday, January 19, 2026 12:30 PM

 

ములుగు జిల్లా జనవరి19:

తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల, మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జరి గిన జిల్లాల పునర్విభజనపై సమీక్షకు రిటైర్డ్ జడ్జితో కూ డిన కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఆమోదం తెలిపారు.

మేడారం జాతర కోసం శాశ్వత భవనాల నిర్మాణం, జంపన్న వాగుకు నీటి మళ్లింపు.. 2027 గోదావరి పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ములుగు జిల్లా పొట్లపూర్ లో ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది, ఎస్ బీ ఐ కి మెట్రో ఫేజ్-2 భూసేకరణకు నిధులు కేటాయిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ రాజకీయ, పరిపాలనా చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృత మైంది. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజధాని హైదరాబాద్ వెలుపల.. అది కూడా అడవి బిడ్డల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారల మ్మ కొలువైన మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

ఆదివారం సాయంత్రం ములుగు జిల్లా మేడారం లోని హరిత హోటల్‌ వేదికగా జరిగిన ఈ 27వ క్యాబినెట్ భేటీలో మున్సి పల్ ఎన్నికలు, జిల్లాల పునర్విభజన వంటి పలు కీలక నిర్ణయాలకు ఆమో దం తెలిపారు. రాష్ట్రంలో గడువు ముగిసిన స్థానిక సంస్థల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీ లు, 7 కార్పొరేషన్లు మరియు 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

అందుకే ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది, ఫిబ్రవరి నెలలో రంజాన్, శివరాత్రి, పండుగలు ఉన్నందున ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ రూపొందించుకోవాలని కేబినెట్ అధికారులకు సూచించింది.. 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు ఉన్నందున ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేయాలని కెబినెట్ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి రెండో వారంలోనే ఈ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తుంది, ఇప్పటికే వెనకబడిన తరగతుల రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పించగా.. జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. మహిళలు, బీసీలకు లాటరీ పద్ధతిలో స్థానాలను కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

05 Feb 2026

Leave a Comment