మోర్తాడ్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు సాయన్నకు ఘన సన్మానం….

On: Saturday, August 30, 2025 8:45 PM

 

నిజామాబాద్ జిల్లా, మోర్తాడ్ :

మోర్తాడ్ మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన బి. సాయన్నను దళిత సంక్షేమ సంఘం, అంబేడ్కర్ యువజన సంఘం, ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం సంయుక్తంగా ఘనంగా సన్మానించారు.

శనివారం మోర్తాడ్‌లోని ఫూలే విగ్రహం వద్ద సాయన్నకు శాలువా కప్పి సత్కారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏవైఎస్ మండల అధ్యక్షులు అంగుళి మాలజీ మాట్లాడుతూ – “రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పాత్రికేయులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ఉచిత బస్ పాస్, పెన్షన్ సౌకర్యాలు ఉన్నాయి. తెలంగాణలోనూ అర్హులైన పాత్రికేయులకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్ సౌకర్యం కల్పించి, నెలకు కనీసం రూ.20 వేల పెన్షన్ ఇవ్వాలి. అలాగే వారికి ఇండ్లు కట్టించి ఫ్యామిలీలను ఆదుకోవాలి” అని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ మామిడి రాజు, జాంబవ చమార్, రాజారెడ్డి, గంగాధర్, బండ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొని సాయన్నకు అభినందనలు తెలిపారు

15 Mar 2026

Leave a Comment