Aug 03, 2025,
ప్రధాని మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఏఐసీసీ లీగల్ సెల్ సదస్సులో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. ’75 ఏళ్ల తర్వాత పదవిలో ఉండొద్దని మోహన్ భగవత్ చెప్పారు. పదవి నుంచి దిగిపోవడానికి మోదీ సిద్ధంగా లేరు. గతంలో అద్వానీ, జోషికి వర్తించిన నిబంధన మోదీకి వర్తించదా? వచ్చే ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. మోదీ హటావో- దేశ్ బచావో’ అని అన్నారు.