మేడారంలో మంత్రి సీతక్క పర్యటన!

On: Monday, September 22, 2025 1:49 PM

 

  • ములుగు జిల్లా: సెప్టెంబర్22
  • సీఎం రేవంత్ రెడ్డి మంగళ వారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పర్యటించనున్నారు.మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యటన నేపథ్యంలో పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో అభివృద్ధి పనులనుపరిశీలించారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పి షబరిష్ లతో కలిసి సందర్శించారు. మంగళ వారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, సమ్మక్క సారలమ్మ దేవాల యాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పర్యాటక పనులను మంత్రి సీతక్కపరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎ ఎస్ పి శివం ఉపాధ్యా య, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్, జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్ డిఒ వెంక టేష్, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గరావు, ఇఒ వీరస్వామి, ఎ పి ఓ వసంత రావు, సంబంధిత అధికా రులు, తదితరులు పాల్గొన్నారు.
04 Feb 2026

Leave a Comment