ఎ9 న్యూస్ డెస్క్, ఆగస్టు 21, సెక్రటేరియట్:
మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కొండ సురేఖతో తాను వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. “మా మధ్య రాజకీయ విభేదాలు ఉండొచ్చు గానీ, వ్యక్తిగతంగా ఏదీ లేదు,” అని ఆమె తెలిపారు.
ఆమె మాటల్లోనే:
“గతసారి కొండ సురేఖ గారు అనారోగ్యం కారణంగా, సొంత పనుల వల్ల రాలేకపోయారు.”
“ప్రస్తుతం వరంగల్ జిల్లా ఇన్చార్జిగా ఆమె కొనసాగుతున్నారు.”
“మేమిద్దరం సమ్మక్క సారలమ్మ లాగా అక్కాచెల్లెళ్ల మాదిరి ఉన్నాం.”
అదే సమయంలో, సీతక్క సమాజంలో ఆడబిడ్డల ప్రాధాన్యాన్ని చర్చించారు:
> “సమాజంలో ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు. ఇంట్లో, సమాజంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది. రాజకీయాల్లో ఆడబిడ్డల్ని ఎదగనివ్వాలి,” అని ఆమె వ్యాఖ్యానించారు.








