
📍 ఎ9 న్యూస్, మెదక్ | ఆగస్టు 14
వాతావరణ శాఖ మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
👉 కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పరిశీలన.
జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శనివారం దుప్ సింగ్ తండా కాస్‌వే మరియు పోచారం డ్యామ్ ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తూ, భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
📞 పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
సంప్రదించాల్సిన నంబర్: +91 87126 57888.
🚨 QRT బృందాలు సిద్ధం.
జిల్లా వ్యాప్తంగా అత్యవసర పరిస్థితులకు స్పందించేందుకు:
4 QRT బృందాలు.
మొత్తం 60 మంది సిబ్బంది.
జిల్లా పోలీస్ కార్యాలయంలో standby లో ఉంచారు.
⚠️ ప్రమాదకర ప్రాంతాలు:
11 ప్రమాదకర ప్రాంతాలను గుర్తింపు.
ప్రత్యేకంగా ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో, ప్రజలను అప్రమత్తం చేయడంకోసం పీకెట్లు (barricades) ఏర్పాటు చేశారు.
🛑 ప్రజలకు విజ్ఞప్తి
ప్రజలు అవసరం లేకుండా నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా, అప్రమత్తంగా ఉండాలని, స్థానిక పోలీస్ స్టేషన్లతో సమన్వయంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు.






