A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రోజు ఆర్మూర్ నూతన సబ్ కలెక్టర్ గా ఇటీవల బాధితులను స్వీకరించిన అభిగ్యాన్ మాలవీయాను ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ప్రస్తావించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పాత్రికేయులకు అందేలా చూడాలన్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనం కొరకు స్థలం కేటాయించాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి అడిగిన వాటిని పై అధికారులతో చర్చించి సమకురేల చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు పద్మారావు, కోశాధికారి అజీమ్, ఉపాధ్యక్షుడు జానా రమేష్, సంయుక్త కార్యదర్శి చక్రధర్, ఈసీ మెంబర్లు చేతన్, సామ మురళి, జర్నలిస్టులు క్రాంతి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.







