జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో సమస్యలకై గ్రామ సెక్రెట్రీ కి వినతిపత్రం అందజేశారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా తయారయ్యిందని దాని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వెంటనే శుభ్రం చేయాలనీ కోరారు, అదే విధంగా గ్రామంలోని మంచి నీటి ట్యాంకును కూడా శుభ్రం చేయాలనీ మరియు పారిశుద్య కార్మికులకు వేతనాలు చెల్లించి పనులు ప్రారంభించాలని వారు తెలిపారు,అలాగే వీధి దీపాలు లేని ప్రదేశంలో వెంటనే దీపాలను అమర్చాలని డిమాండ్ చేశారు, ఈ సమస్యలు వెంటనే పరిష్కరించని యెడల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో CPI(ML) ప్రజాపంత సభ్యులు ఆల్గొట్ సాయిలు,దుంపేట గంగాధర్,బాలయ్య,పోశెట్టి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.







