ఎస్సైని ఘనంగా సన్మానించిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు….

On: Tuesday, August 19, 2025 6:07 PM

 

ఆర్మూర్, ఆగస్ట్ 19:

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్‌ను అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న, మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్ ఆధ్వర్యంలో ఎస్సై రమేష్‌కు శాలువా కప్పి సన్మానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులైన అంగుళీమాల, బండ ప్రసాద్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు సేవలపట్ల కృతజ్ఞతగా ఈ సన్మానం చేపట్టినట్టు సంఘ ప్రతినిధులు తెలిపారు.

ఎస్సై రమేష్ మాట్లాడుతూ, ప్రజల భద్రతకే తన ప్రాధాన్యత అని, ఈ రకమైన గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.

19 Aug 2025

Leave a Comment