నేర రహిత సమజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీస్లతో సమానం.
నేరల పరిశోదనకు , ప్రజల భద్రతను మెరుగుపరచడానికి సీసీ కెమెరాలు.
ఎ 9 న్యూస్, మెదక్ ,జూలై 11:
శుక్రవారం నాడు మెదక్ టౌన్ పరిధిలోని నూతన బస్సు స్టాండ్ లో దాతల సహకారం తో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోస్తవానికి ముఖ్య అతిధిగా మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు హాజరై ప్రారంభించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ . డి. వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ
సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరలను అదుపు చేయవచ్చని, దొంగ తనలను నివారించే అవకాశం ఏర్పడు తుందని అన్నారు.
ఒక వెళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని అన్నారు.
సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలను అరికట్టడం జరిగిందని అన్నారు జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో,పట్టణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా పోలిస్ శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమనికి హాజరైన ఆర్టీసీ సిబ్బంది కి సూచనలు చేస్తూ బస్సు డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ చూడడం గాని మాట్లాడంగాని చేయకూడదని చెప్పారు.
డ్రైవింగ్ చేసే సమయంలో ఏమైనా అత్యవసరమైన కాల్ వస్తే వాహనాన్ని పక్కకు నిలుపుకొని మాట్లాడాలని తెలిపారు. బస్సు లో ఫుట్ బోర్డు ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించ వద్దని అన్నారు. అదే విధంగా జిల్లాలో జరుగుతున్న ప్రమాదలకు ముఖ్య కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు రాంగ్ రూట్ డ్రైవింగ్ వలన జరిగినవెనని అన్నారు. కావున జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విసృతంగా చేపడుతున్నమాని అందులో బాగంగా ప్రతి రోజు 2 గంటలు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపడుతు న్నారని అన్నారు. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ కు పలు పడితే జరిమానాలు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు లో కీలకంగా వ్యవరించిన మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ . మహేష్ ని మరియు ఆర్టీసీ డిపో మేనేజర్ . సురేఖ ని, ప్రజల సంక్షేమం కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన చంద్ర భవన్ రాగి అశోక్ ని మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ లోని షాప్స్ ఓనర్స్ ను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ మరియు ఆర్టీసీ డిపో మేనేజర్ .సురేఖ మరియు మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ . మహేష్ గారు మరియు దాతలు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.