A 9 న్యూస్, మెదక్, నర్సాపూర్:
పంచాయతీ ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తమ స్వగ్రామమైన రెడ్డిపల్లి గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు వేయడంపై నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య రక్షణలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరు తన హక్కును బాధ్యతతో వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల చైతన్యంతోనే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఆయన అన్నారు.








