ఎర్లీచైల్డ్హుడ్ ఎడ్యుకేషన్కు ప్రత్యేక ఆహ్వా నితులుగా హాజరైన మెదక్ జిల్లా కలెక్టర్రాహుల్ రాజ్:

On: Friday, July 11, 2025 5:43 AM

 

 

 

 

 

ఎ9 న్యూస్, మెదక్ ,జూలై 11:

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఎర్లీ చైల్డ్ హుడ్,ఎడ్యుకేషన్(చిన్ననాటి విద్య) పై నేషనల్ వర్క్ షాప్కు ప్రత్యేక ఆహ్వానితులుగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్(చిన్ననాటి విద్య) పై ఢిల్లీలో నేషనల్ వర్క్ షాప్ నిర్వహించగా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశంలో మాట్లాడుతూ…జాతీయ సమావేశానికి తెలంగాణ నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనిత రామచంద్రన్ ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో అమలవుతున్న నూతన కార్యక్రమాలు, పిల్లలకు ప్రైమరీ శిక్షణ, కొత్త యూనిఫారాలు అందించడం వంటి తదితర ఇతర పోషణ శిక్షణకు సంబంధించిన కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాల ప్రతినిధులలు సైతం తమ రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు, చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

22 Jul 2025

Leave a Comment