24వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మట్టెల శ్రావణ్ కుమార్ (ఎం.ఫార్మ్.) గారు వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విద్యావంతులను గెలిపిస్తేనే వార్డుకు నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది” అని అన్నారు.
ఏ పదవి లేకున్నా గతంలోనే వార్డు ప్రజల సమస్యలను గుర్తించి, నాయకులు–అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు సాధించిన అనుభవం తనకు ఉందని తెలిపారు. రోడ్ల మరమ్మతులు, మురికి కాలువల శుభ్రత, కరెంట్ లైనింగ్ పనులు, పేదలకు ఇళ్ల సదుపాయం, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం వంటి అంశాలపై నిరంతరం పోరాడినట్లు పేర్కొన్నారు.
ఉన్నత విద్యావంతుడిగా, దూరదృష్టి గల ఆలోచనలతో, సేవాభావంతో ప్రజల కష్టసుఖాలలో భాగస్వామిగా నిలిచిన వ్యక్తిగా 24వ వార్డు ప్రజల నుండి విశేష మద్దతు లభిస్తోందన్నారు. కౌన్సిలర్‌గా గెలిస్తే వార్డును ఆదర్శవంతమైన, సురక్షితమైన, సుందరమైన వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. కారు గుర్తుకు ఓటు వేసి మట్టెల శ్రావణ్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.








