అర్ముర్, డిసెంబర్ 22:
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరు గణితానికి సంబంధించిన పరికరాలు ప్రాజెక్టులు వివిధ రకాల ఆసక్తికరమైన మోడల్స్ ని తీసుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు గణితాన్ని సులువుగా చేసే పద్ధతులను చక్కగా వివరించారు.అంతేకాకుండా గణిత దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు.అందులో భాగంగా గణితానికి సంబంధించిన పాటలు ఉపన్యాసాలు క్విజ్ కాంపిటేషన్ నిర్వహించడం. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల మేనేజ్మెంట్ భాను తేజ్ మాట్లాడుతూ గణిత శాస్త్రం విద్యార్థుల ఆలోచన విధానాన్ని చేసి సమస్యను విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని విద్యార్థుల విజయానికి గణితమే పునాది అని,ఆధునిక కాలంలో అనేక రంగాల్లో ముందంజ వేయడానికి గణితం ఎంతగానో ఉపయోగపడుతుందని గణిత దినోత్సవం ఆధారంగా పాఠశాలలో ఇలాంటి పోటీలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యంగా చిన్నారులందరు గణిత చాటులు నమూనాలు పజిల్స్ ప్రాజెక్టులు గణిత సూత్రాలతో అందరిని ఎంతగానో అలరించారని తరగతి గదిలో గణితశాస్త్రం బోధించడానికి సులభమైన పద్ధతిలో బోధించడం ద్వారా విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి పెరుగుతుందని మాట్లాడారు. తదనంతరం శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి మాల వేసి సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ వినోద్ కుమార్, మాతాజీలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.







