ఎ9 న్యూస్, మాసాయిపేట – సెప్టెంబర్ 5:
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం కేంద్రంలోని చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, గ్రామ అభివృద్ధి పరంగా చేపట్టవలసిన కార్యక్రమాలను చర్చించేందుకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ కాన్స్టిట్యూయెన్సీ బీజేపీ సీనియర్ నాయకుడు తరుణ్ నాయుడు ఆధ్వర్యంలో, మాసాయిపేట ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు ఆకారం బాబు, బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి అవసరమైన వనరులు, ప్రాధాన్యతలపై ఈటెల రాజేందర్‌కు వినతి పత్రం అందజేశారు.
తద్వారా గ్రామ స్థాయి సమస్యలు రాష్ట్ర నాయకత్వానికి చేరవేయడం ద్వారా పరిష్కార మార్గాలు వెలికితీయాలని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.







