బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కలిసిన మాసాయిపేట బిజెపి నాయకులు….

On: Saturday, July 19, 2025 1:38 PM

 

ఎ9 న్యూస్ ,మాసాయిపేట,, మెదక్, జులై 19:

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావుని మసాయిపేట బీజేపీ మండలం నేతలు కలవడం జరిగింది అని మొలుగు నాగేందర్ రెడ్డి అన్నారు అనంతరం,

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులు నారపరాజు రామచంద్ర రావు ,మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన సందర్భంలో మసాయిపేట మండల బీజేపీ నాయకులు ఆయనను ఆత్మీయంగా శాలువాతో సన్మానం చేశారు అని తెలిపారు. అదేవిధంగా,మాసాయిపేట మండలంలో ఉన్న విషయాలు చర్చించు కోవడం జరిగిందని బిజెపి నాయకులు పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో:

మండల ఉపాధ్యక్షులు పాప్పన్నగారి శ్రీకాంత్,

మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్,

మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఆకారం బాబు,బూత్ అధ్యక్షులు గౌరగాళ్ల రాములు, కుమ్మరి నరేందర్, నరేష్, రాజు, శ్రీకాంత్ గౌడ్

తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షత స్వీకరణ అనంతరం తొలిసారి మెదక్ జిల్లా వచ్చిన సందర్భాన్ని ప్రత్యేకంగా భావించిన నాయకులు, రామచంద్ర రావుకి శుభాకాంక్షలు,తెలుపుతూ, భవిష్యత్ కార్యాచరణపై సలహాలు సూచనలు పొందారు.

22 Jul 2025

Leave a Comment