ఆర్మూర్ బైపాస్ రోడ్‌లో పోలీసులు సడెన్ రైడ్.
36 గ్రాముల గంజాయి స్వాధీనం.
ఆర్మూర్, ఆగస్ట్ 25:
ఆర్మూర్ పట్టణానికి చెందిన ఆలూరు బైపాస్ రోడ్ వద్ద నిషేధిత గంజాయి అమ్మకానికి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అరెస్టు చేశారు. నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసుల ప్రత్యేక దళం, పెర్కిట్ గ్రామానికి చెందిన షేక్ కాలిద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, కాలిద్ వద్ద నుంచి నాలుగు పాకెట్లు గంజాయి, మొత్తంగా సుమారు 36 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను మహారాష్ట్రలోని మన్మాడ్ సమీపంలోని మాలే గావ్ గ్రామం నుంచి 20 ప్యాకెట్లు గంజాయి తెచ్చినట్లు వెల్లడించాడు. వాటిని ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నానని ఒప్పుకున్నాడు.
ఇటీవల గంజాయి వినియోగం పెరుగుతోందన్న నేపథ్యంలో పోలీస్ విభాగం నిఘా పెంచింది. ఈ కేసులో ప్రస్తుతం షేక్ కాలిద్‌పై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, మరింత దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.







