A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి:
ఇందల్వాయి మండలంలోని,అన్సన్ పల్లి :
గ్రామ పంచాయితీ పరిధిలో గ్రామ ప్రజలకు మలేరియా చెకబ్ చేసారు. 30 మందికి చెకబ్ చేయగా ఎవరికికూడా పాజిటివ్ రాలేదు.అలాగే డెంగ్యూ వ్యాధి గూర్చి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఇంటిలోపల కానీ బయట ఆవరణలలో కానీ నీళ్ళను నిల్వ ఉంచుకోవడం సరికాదు. వర్షపు మరియు మురికి నీళ్లు నిల్వ ఉండడం ద్వారానే దోమలు తయార్ అవుతున్నాయని మనకు దోమ కాటువేయడం ద్వారా మలేరియా లేదా డెంగ్యూ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వారు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వై.శంకర్ ఆరోగ్య విస్తీరణ అధికారి, అక్బర్ అలీ ఆరోగ్య పర్యవేక్షకులు, సి.రాజేందర్ మలేరియా సబ్ ఎడిటర్ అధికారి. ఏ.లేయా ఎంఎల్ హెచ్ పి మరియు ఆరోగ్య కార్యకర్తలు వెంకట్ రెడ్డి, ఏఎన్ఎం మమత, గ్రామ పంచాయితీ కార్యదర్శి అశ్వంత్, ఆశావర్కర్లు జులేఖ, భాగ్య పంచాయితీ సిబ్బంది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.







