ఆలూర్‌లో మాల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా….

On: Monday, August 11, 2025 8:03 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆలూర్ మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు అగ్గు క్రాంతి ఆధ్వర్యంలో మాల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అగ్గు క్రాంతి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనలో ఎస్సీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో దివంగత నేత పివి రావు పిలుపుతో లక్షలాది మాలలు చలో సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొని చరిత్ర సృష్టించారని చెప్పారు ఆందోళనను అణచివేయడానికి అప్పటి ముఖ్యమంత్రి ఉక్కుపాదం మోపగా పానంగి శేషయ్య గోప తొట్టి నారాయణ ప్రాణాలు కోల్పోగా, పివి రావు, ఎంకే భీమారావు గిడ్ల పరంజ్యోతి రావు జి. చెన్నయ్యలు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు కార్యక్రమంలో మాల మహానాడు నిజామాబాదు జిల్లా జాయింట్ సెక్రటరీ చిట్టీ బాబూ మండల ప్రధాన కార్యదర్శి పిట్ల శోభన్ జాన్ బంజ పెండ భాస్కర్ హరీష్ శేఖర్ భోజ్ అరుణ్ ప్రదీప్ వినయ్‌తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

14 Mar 2026

Leave a Comment