

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకోగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. పట్టణంలోని రాజారాం నగర్ కాలనీకి చెందిన కొంగుల అంకిత, అపర్ణలు జీవన్ మాల్‌లో విధులు నిర్వహించుకుని తమ గమ్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ సందర్భంగా గగ్గుపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు అతివేగంతో వచ్చి వారి స్కూటీని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు తీవ్ర గాయాలకు గురయ్యారు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








