మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి – కిసాన్ మోర్చా డిమాండ్….

On: Wednesday, October 8, 2025 8:39 PM

 

ఆర్మూర్, అక్టోబర్ 08 – A9 న్యూస్:

🔹 వినతిపత్రం సమర్పణ:

భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

🔹 విషయనిర్దేశం:

రైతులు మొక్కజొన్న కు తగిన మద్దతు ధర లేక, కొనుగోలు కేంద్రాల సంఖ్య లేకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

🔹 ప్రస్తుత పరిస్థితి:

MSP (మద్దతు ధర): ₹2400.

దళారుల కొనుగోలు ధర: ₹1800–₹2000.

రైతులకు నష్టం: క్వింటాలకు ₹400–₹500.

కిసాన్ మోర్చా డిమాండ్లు:

1. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

2. రబీ సీజన్‌లో పండించిన వడ్లకు క్వింటాకు ₹500 బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేయాలి.

3. పసల్ బీమా యోజనను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలి.

4. రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలి.

పాల్గొన్నవారు:

చిట్టి భజన, పోశెట్టి మల్లయ్య, శ్రీనివాస్, సంతు, కలిగోట ప్రశాంత్ మరియు ఇతర రైతులు.

07 Dec 2025

Leave a Comment