వరిగుంతo గ్రామంలో మహా సంపర్క్ అభియాన్ – బీజేపీ ఇంటింటి ప్రచారం…

On: Tuesday, August 5, 2025 7:43 PM

 

A9 news,

మెదక్ జిల్లా, కొల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో “మహా సంపర్క్ అభియాన్” కార్యక్రమం భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి బూత్ స్థాయి అధ్యక్షులతో కలిసి డోర్ స్టిక్కర్లు మరియు కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారు పాల్గొని కార్యకర్తలకు ఉత్సాహం నింపారు.

ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు హరీష్ గారు, ఉపాధ్యక్షులు వెంకట్ గారు, మాజీ ఉపాధ్యక్షుడు ప్రకాష్ గారు, బీజేపీ నాయకులు అరుణ్ గారు, బూత్ అధ్యక్షులు సురేష్ గారు, మానయ్య గారు, మహేష్ యాదవ్ గారు, శివ గారు, అంజి నాయక్ గారు మరియు ఇతర పలువురు కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొన్నారు.

ప్రజల్లో బీజేపీ సిద్ధాంతాలను చాటి చెప్పేందుకు, పార్టీకి మద్దతును పెంపొందించేందుకు ఈ మహా సంపర్క్ అభియాన్ ఓ ముఖ్యమైన అస్త్రంగా మారుతోoది.

07 Aug 2025

Leave a Comment