గద్దర్‌కు ఘన నివాళులు అర్పించిన ఆర్మూర్ దళిత, ప్రజా సంఘాల నాయకులు….

On: Saturday, January 31, 2026 5:04 PM

ఆర్మూర్:

తన కలం, గళంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదుతూ, సమాజంలో నెలకొన్న అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగించిన ప్రజాగొంతుక, తెలంగాణ ఉద్యమ కెరటం, ప్రజయుద్ధ నౌక గద్దరన్న గారి 78వ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించారు.

ఆర్మూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్ డివిజన్ దళిత, ప్రజా, యువజన సంఘాల ఆధ్వర్యంలో గద్దర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వనం శేఖర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గంట సదానందం గార్లు మాట్లాడుతూ— తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలను తన గళంతో, కలంతో ప్రశ్నించిన మహానాయకుడు గద్దర్ అని కొనియాడారు. సమాజంలో వేళ్లూనుకున్న వివక్ష, అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన ఆయన వీరోచిత జీవితం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, అంసా అధ్యక్షులు అంగరి ప్రదీప్, సీపీఎం నాయకులు ఎల్లన్న, ముగా ప్రభాకర్, షెట్పల్లి నారాయణ, జంగం అశోక్, పింజ పెద్ద భోజన్న, మేకల కోటేశ్వరరావు, ఆర్గుల్ సురేష్, పులి సాయిరాం, పులి గంగాధర్, నటరాజ్, సాయిరాం, అంబులెన్స్ రాజులు తదితరులు పాల్గొని గద్దర్ త్యాగనిరతిని స్మరించుకున్నారు.

04 Feb 2026

Leave a Comment