కృష్ణావాటాలో ద్రోహం చేసిందే కేసీఆర్: ఉత్తమ్

On: Wednesday, July 9, 2025 9:05 PM

 

A9 news,Jul 09, 2025,

తెలంగాణ : బీఆర్ఎస్ పాలనలోనే రాయలసీమకు కృష్ణా నదీ జలాలను అక్రమంగా తరలించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మాజీ సీఎం కేసీఆర్ పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ తర్వాత కూడా కేంద్ర జలవనరుల సంఘం అనుమతి లేకుండానే ఉమ్మడి ఏపీలో అనేక ప్రాజెక్టుల పనులు ప్రారంభించారని, అలాగే ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి ప్రాజెక్టుల పట్ల బీఆర్ఎస్ నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు.

24 Jul 2025

Leave a Comment