శ్రీరాంపూర్ లో జరిగిన హెచ్ఎంఎస్ (హింద్ మజ్దూర్ సభ) జనరల్ బాడీ సమావేశంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు గౌరవ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఓ ప్రతిపాదన పెట్టగా, సమావేశంలో ఉన్న సభ్యులందరూ ఒక్క గొంతుగా ఆమోదం తెలిపారు.
ఈ పదవికి ఎన్నికైన రెండో బీఆర్ఎస్ నేతగా కవిత నిలవడం గమనార్హం. గతంలో నాయిని నర్సింహారెడ్డి ఈ పదవిని చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ ఎంపికతో కార్మిక సంఘాల్లో బీఆర్ఎస్ ప్రభావం మరింత బలపడనుందని భావిస్తున్నారు.







