ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక…..

On: Friday, August 1, 2025 5:25 AM

 

హైదరాబాద్:

కాళేశ్వరం ఆయకట్టుకు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్, కమిషన్ నివేదికను సమర్పించింది, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ కు నివేదిక అందజేసింది, 2024 మార్చి 14న కమిషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఈ కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ల, ఆనకట్టలకు సంబంధించి విచారించింది,

115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది, కమిషన్ నివేదిక తో రాహుల్ బొజ్జా సచివాల యానికి బయలుదేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుకు నివేదిక సమర్పించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై రేవంత్ సర్కారు 2024, మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్‌ ను ఏర్పాటు చేసింది.

విచారణలోని అంశాలని క్రోడీకరించి తుది నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది.జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి నివేదిక అందుకున్న అనంతరం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడారు.

02 Aug 2025

Leave a Comment