జిట్ల గంగామణి సేవలు చిరస్మరణీయాలు…

On: Monday, September 1, 2025 7:30 PM

ఆర్మూర్, సెప్టెంబర్ 1:

వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలు జిట్ల గంగామణి రిటైర్మెంట్ సన్మాన మహోత్సవ కార్యక్రమం ఆర్మూర్ పెర్కిట్ ఎమ్మార్ గార్డెన్‌లో ఘనంగా జరిగింది.

కార్యక్రమానికి రిటైర్డ్ అదనపు ఎస్పీ మహేందర్, ఎంఈఓ రేణుక ముఖ్య అతిథులుగా, రాజేందర్ గౌడ్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. పీఆర్టీయూ నాయకులు దేవానందం, కాంతయ్య, హరి చరణ్, ఈ.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాజశేఖర్ మాట్లాడుతూ – “గంగామణి గారు 42 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో ఎందరో విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దారు. ఆమె సేవలు విద్యారంగంలో అజరామరంగా నిలుస్తాయి” అన్నారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, బంధువులు, శ్రేయోభిలాషులు పాల్గొని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సమన్వయకర్తగా విశ్రాంత ఉపాధ్యాయుడు జింధం నరహరి వ్యవహరించారు.

భర్త జక్కపల్లి పండరి (రిటైర్డ్ చీఫ్ పోస్ట్ మాస్టర్), చింత మురళీధర్ (రిటైర్డ్ ఏఈ పంచాయతీ రాజ్), రిటైర్డ్ ఎంఈఓ సాయన్న, రిటైర్డ్ పీ.జి హెచ్.ఎం ధోండి శ్యామల, ఈ.ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఈరవత్రి రాజశేఖర్, సహచర ఉపాధ్యాయులు, కాలేజీ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు

15 Mar 2026

Leave a Comment