నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలంలోని ,బెజ్జోరా గ్రామ సర్పంచ్ పదవికి బరిలో దిగిన యువ నాయకుడు జితేందర్ రాజకీయంలో గానీ అధికారులకు గాని మంచి పట్టు ఉన్న నాయకుడు.వైద్యుడు ప్రజాసేవ భావనతో ఒక సేవకుడిగా గ్రామ ప్రజల సేవ కోసం సర్పంచ్ పదవికి బరిలో ఉన్నాడు. గ్రామ ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి, గెలిపిస్తే ప్రజల సేవకి ఉంటానని తెలియజేశారు.
నేను ఇచ్చిన హామీలని 3సంవత్సరాలలో నెవేర్చకుంటే స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేస్తాను. చివరగా మందుకి మాంసానికి డబ్బులకి మీ ఓటు అమ్ముకోకండి…వయస్సుని, వర్గాన్ని చూడకుండా జ్ఞానవంతునికి ఓటు వెయ్యండి.ఉత్తమ గ్రామ పంచాయితిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించగలరు.
మన గ్రామములో ప్రధాన సమస్యలు మొదటివి మంచి నీటి సరఫర, డ్రైనేజిలు, పారిశుధ్యం, విధి దీపాల మెయింటనెన్స్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాను. డ్రైనేజీ వ్యవస్థను మరమ్మతులు చేసి కావలసిన చోట నూతన డ్రైనేజీని కట్టిస్తాను. అలానే పూర్తి సర్పంచ్ జీతం స్కూల్ అవసరాలకు మరియు విద్య వాలంటీర్లుకు అందిస్తాను నాకు ఊర్లో ఉన్న సమస్యల పై ఖచ్చితమైన అవగాహన ఉంది. ప్రతినెల గ్రామసభ నిర్వహించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషిచేస్తాను. ప్రతి ఒక్కరికి, ప్రతిరోజు ఉ॥ 9గం॥ల నుండి ఉ॥ 11గం॥ల వరకు గ్రామ పంచాయతి కార్యాలయంలో ఉచిత వైద్యం చేస్తాను…! వృద్ధులకు, దివ్యాంగులకు, పెన్షన్లు అందిస్తాను.
అర్హులందరికి ప్రభుత్వ పథకాలు ఇంటింటికి అందేలా కృషిచేస్తాను. ఉచిత కంటి ఆపరేన్లు చేయిస్తాను. ప్రతి మూడు నెలలకొకసారి ఉచిత మెగా వైద్యశిభిరం నిర్వహిస్తాను. లైబ్రరి ఏర్పాటుకు కృషిచేస్తాను. యువకులకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాను. ఊరి భద్రతకోసం సి.సి కెమెరాలను నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా ఉండటమే ధేయ్యంగా, ఆర్యోరహిత గ్రామంగా పనిచేయటమే లక్ష్యం…







