బంగారం ధరల పెరుగుదలతో స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులు – విశ్వకర్మ మహాసభ అండగా

On: Friday, September 12, 2025 6:07 PM

A9 న్యూస్ ప్రతినిధి సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన ముండరాయి సత్యం చారి బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు తాళలేక మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. అప్పుల వేదనతో ఆయన కుటుంబం కూడా తీవ్ర ఆందోళనలో ఉందని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి తెలిపారు.

ఈ కష్టసమయంలో విశ్వకర్మ మహాసభ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని, సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకారుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని కనీస పెన్షన్, బీమా, బ్యాంకు గ్యారంటీ లోన్లు అందించి ఇలాంటి ఆత్మహత్యలు నివారించాలని డిమాండ్ చేశారు.

“ప్రతి స్వర్ణకారుడు ధైర్యంగా ఉండాలి – విశ్వకర్మ మహాసభ ఎల్లవేళలా మీ వెన్నంటి ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు.

08 Mar 2026

Leave a Comment