పార్టీకి ఏ మేరకు లాభం?.
బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత తుపాను కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఆమె అయితే వార్తల్లో ఉంటున్నారు కానీ పార్టీ మాత్రం బద్నాం అవుతుంది.
కల్వకుంట్ల కవిత అసంతృప్తి ఇప్పట్లో చల్లారేటట్లు కనిపించడం లేదు. సొంత సోదరుడు కేటీఆర్ ను ఆమె లక్ష్యంగా చేసుకుని చేస్తున్న కామెంట్స్ పార్టీ క్యాడర్ ను కూడా కొంత ఆవేదనకు గురి చేస్తున్నాయి. కల్వకుంట్ల ఇంట్లో ఈ విభేదాలు ఎవరూ ఊహించనవి. కేటీఆర్, కవిత, హరీశ్ రావు అందరూ కలసి కేసీఆర్ కు అండగా ఉంటారని అనుకున్నారు. కానీ ఇప్పుడు కవిత చేస్తున్న కామెంట్స్ తో పాటు కేటీఆర్ మొండిపట్టు పట్టడం వంటివి చూస్తుంటే రాను రాను ఈ వివాదం మరింత ముదురుతుందని, సద్దుమణిగే అవకాశాలు లేవన్నది స్పష్టంగా తెలుస్తుంది.
*ఫోన్ ట్యాపింగ్ లోనూ…
కల్వకుంట్ల కవిత తన ఫోన తో పాటు తనఇంట్లో వారి ఫోన్లు కూడా గత ప్రభుత్వంలో ట్యాప్ అయినట్లు అనుమానం వ్యక్తం చేయడంతో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనకు ఊతమిచ్చినట్లయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ఆయనతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసినట్లు కనపడుతుంది. కేసీఆర్ పక్కనే కోటరీలాగా మారి ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని కవిత పదే పదే ఆరోపిస్తున్నారు. సంతోష్ రావు గురించి కవిత ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇక కవిత చేసిన వ్యాఖ్య కూడా పార్టీలోనే కలకలం రేపేదిగా ఉంది. ఎప్పటికైనా తాను ముఖ్యమంత్రిని అవుతానని ఆయన అన్నమాట ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులుపుట్టిస్తున్నాయి.
*అసలు టార్గెట్ …
కల్వకుంట్ల కవిత అసలు టార్గెట్ ముఖ్యమంత్రి అన్నట్లుగానే మాట్లాడటంతో ఇంక వివాదం మరింత పీక్స్ కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటిపోరు కారు పార్టీలో ఇబ్బందిగా మారిందని సోషల్ మీడియాలో గులాబీ పార్టీకి చెందిన కార్యకర్తలే కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదాలకు పుల్ స్టాప్ పెట్టి పార్టీని అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలని, ఇలాగే కుటుంబంలో వివాదాలు కొనసాగితే కాంగ్రెస్ కు మరోసారి అవకాశం చేజేతులా ఇచ్చినట్లవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటు కవిత అటు కేటీఆర్ ఇద్దరూ ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేకపోవడంతో ఇప్పుడప్పడే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపించడం లేదని స్పష్టంగా తెలిసింది.