ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను కలిసిన ఇస్కాన్ ప్రతినిధులు….

On: Friday, September 5, 2025 12:34 PM

 

ఎ9 న్యూస్, మెదక్ – సెప్టెంబర్ 5

సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇస్కాన్ ఆధ్యాత్మిక, సామాజిక అభివృద్ధి కేంద్రంకు రహదారి వసతి కల్పించాలంటూ, ఇస్కాన్ ప్రతినిధులు మంత్రి సీతక్కను ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

మొత్తం 18 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో గోశాల, అన్నదాన సత్రం, సేంద్రియ వ్యవసాయ శిక్షణ, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రతినిధులు వివరించారు.

ప్రాజెక్టుకు రాకపోకలకు అనువుగా రహదారి అవసరం ఉందని, తక్షణమే నిర్మాణానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఇస్కాన్ బృంద విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క, రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, పీఆర్ఎండ్‌ఈ (PR&ENC) విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.

15 Mar 2026

Leave a Comment