హైదరాబాద్:మార్చి 18:
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యారు. అయితే, వారి భవిష్యత్తు ను నిర్ణయించే మూల్యాం కన ప్రక్రియ ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే ఇంటర్ బోర్డు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించింది. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా పేపర్ల దిద్దుబాటు జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా రు.
మరోవైపు.. ఈనెల చివరి నాటికి మూల్యంకన ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు గడువు విధించుకుంది. పేపర్లు దిద్దుబాటు పూర్త యిన వెంటనే మార్కుల నమోదు, ట్యూబులేషన్ వంటి సాంకేతిక ప్రక్రియలను చేపట్టనుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేసుకొని ఏప్రిల్ 5 లేదా 6 వ తేదీన పరీక్షల ఫలితాలను వెల్లడించేం దుకు ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
ఈసారి ఫస్ట్ ఇయర్‌తో పాటు సెకండియర్ ఫలితాలనుకూడా ఒకేరోజు విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది.జూన్ 1వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
జూన్ 1 నాటికి తరగతులు ప్రారంభమయ్యేలోపు ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని భావిస్తోం ది. సప్లిమెంటరీ ఫలితాల ను కూడా ఆలోపే విడుదల చేయడం ద్వారా, విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా పైతరగతుల్లో చేరేందుకు వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు








