నేటి నుంచి ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్….

On: Wednesday, January 21, 2026 11:15 AM

 

Jan 21, 2026,

తెలంగాణ : తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షల హడావుడి మొదలైంది. థియరీ పరీక్షలకు ముందే నిర్వహించే ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 9,00,607 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నేడు ఫస్టియర్ విద్యార్థులకు, గురువారం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పరీక్షించేందుకు గతేడాది నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ రాసే విద్యార్థులకు వెసులుబాటు కల్పించనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.

05 Feb 2026

Leave a Comment