
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేరా గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా జరిగిన అసాంఘిక హింసాత్మక చర్యలను ఖండిస్తూ, రజక దంపతులు గణేష్–మౌనికలపై జరిగిన దాడి మరియు వారి పసిపాప మరణానికి దారితీసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులుగా పేర్కొన్న శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డిలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నాయకులు మరియు పలు ప్రజా సంఘాల సభ్యులు కృపత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పిడిఎస్యు, సిపిఐ సహా వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నిందితులను వెంటనే శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. “మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నాం?” అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో రజక నాయకులు మీరా శ్రావణ్, కొక్కెర భూమన్న, పిడిఎస్యు నాయకులు నరేందర్, నాగరాజు, శ్రీధర్తో పాటు వివిధ సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.








